సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యజమాని కావ్య మారన్(33) పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అన్నీ కుదిరితే ఆమె.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనిరుధ్ రవిచందర్ తో మనువాడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మీడియా దిగ్గజం కళానిధి మారన్ కుమార్తె కావ్య.. సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్ల పైమాటే. సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడైన అనిరుధ్.. ఒక ఊపు ఊపిన ‘వై దిస్ కొలవరి’ పాటకు సంగీతం అందించారు.