దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్యే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ తోపాటు మను బాకర్(షూటింగ్), హర్మన్ ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెట్) ఎంపికయ్యారు. ఈ అవార్డును జనవరి 17న రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. అటు మొత్తం 32 మందికి అర్జున అవార్డులు కూడా ప్రకటించగా అందులో 17 మంది పారా అథ్లెట్లున్నారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య(Bronze) పతకం(Medal) సాధించిన తెలంగాణ క్రీడాకారిణి జివాంజి దీప్తి అర్జున అవార్డుకు ఎంపికైంది.