ఈ IPL సీజన్లో సెంచరీల మోత మోగుతున్నది. మొన్న రోహిత్ శర్మ, నిన్న ట్రావిస్ హెడ్, ఈరోజు నరైన్.. ఇలా సాగుతున్నది సెంచరీల రికార్డు. ఓపెనర్ సునీల్ నరైన్(109; 56 బంతుల్లో 13×4, 6×6) సెంచరీతో విజృంభించడంతో కోల్ కతా నైట్ రైడర్స్(KKR) భారీ స్కోరు చేసింది. సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడి 200 స్ట్రైక్ రేట్(Strike Rate) దంచికొట్టాడు.
అతడు కేవలం 49 బాల్స్ లోనే హండ్రెడ్ అందుకున్నాడు. అందులో 11 ఫోర్లు, 6 సిక్స్ లున్నాయి. రాజస్థాన్ రాయల్స్(RR) టాస్ గెలిచి ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. నరైన్, దీంతో కోల్ కతా 6 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు చేసింది.
స్టార్టింగ్ నుంచీ…
స్టార్టింగ్(Begining) నుంచే టాప్ గేర్లో సాగాడు నరైన్. మొన్న వీరబాదుడు బాదిన ఫిల్ సాల్ట్(10) ఈసారి తక్కువకే ఔటైనా అంగ్ క్రిష్ రఘువన్షీ(30)తో కలిసి రెండో వికెట్ 85 పరుగులు జోడించాడు. రఘువన్షీ తర్వాత అయ్యర్(11), రసెల్(13) వెంటవెంటనే క్యూ కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మాత్రం నరైన్ దూకుడు మామూలుగా సాగలేదు.
బంతి వేస్తే చాలు స్టాండ్స్ లోకి వెళ్లడమే అన్నట్లుగా నడిచింది నరైన్ విధ్వంసక ఇన్నింగ్స్. ఊపుమీదున్న అతణ్ని బౌల్ట్ సూపర్ బాల్ తో బౌల్డ్ చేశాడు. చివర్లో రింకూసింగ్(20 నాటౌట్; 9 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా ఆడటంతో భారీ స్కోరు నమోదైంది.