వెస్టిండీస్ ప్లేయర్ అండ్రీ రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. ఎనిమిదో నంబరులో దిగి సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. రసెల్(64; 25 బంతుల్లో 3×4, 7×6) విజృంభణతో ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూశారు. దీంతో కోల్ కతా 7 వికెట్లకు 208 పరుగులు చేసింది.
ఓపెనర్ కూడా…
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగిస్తే… కోల్ కతా ఓపెనర్, వికెట్ కీపర్ అయిన ఫిల్ సాల్ట్(54; 40 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా ఆడాడు. ఇతడు మినహా సునీల్ నరైన్(2), వెంకటేశ్ అయ్యర్(7), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), నితీశ్ రాణా(9) కంటిన్యూగా ఔటయ్యారు. కానీ రమణ్ దీప్ సింగ్(35), రింకూ సింగ్(23) నిలబడగా… రసెల్ మాత్రం హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. నటరాజన్ 3, మయాంక్ మార్కండే 2 వికెట్ల చొప్పున తీసుకోగా ప్యాట్ కమిన్స్ కు ఒక వికెట్ దక్కింది.