కోల్ కతా నైట్ రైడర్స్(KKR) ధనాధన్ ఆట తీరుతో ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై విరుచుకుపడింది. ప్రతి ఓవర్ కు 14 పరుగులకు పైగా రన్ రేట్(Run Rate) సాధించిందంటే ఆ జట్టు బ్యాటర్ల విధ్వంసం ఎలా సాగిందో అర్థమవుతుంది. ఓపెనర్ సునీల్ నరైన్ సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో 3 సిక్స్ లు, రెండు ఫోర్లు బాదడంతో బౌలర్ ఇషాంత్ శర్మకు దిక్కు తోచలేదు.
ఒకే ఓవర్లో…
ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 26 రన్స్ పిండుకున్నాడు నరైన్. ఆ ఓవర్లో 6, 6, 4, 0, 6, 4 బాదడంతో 3.5 ఓవర్లలోనే కోల్ కతా 50 మార్క్ దాటింది.
21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స్ లతో నరైన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(18) ఔటైనా, అతడి స్థానంలో వచ్చిన అంగ్ క్రిష్ రఘువన్షీ ఢిల్లీ బౌలర్లకు దడపుట్టించాడు. కేవలం 14 బాల్స్ లోనే 31 రన్స్ చేశాడు. కోల్ కతా కేవలం 7.3 ఓవర్లలోనే 100 మార్క్ ను చేరుకుంది.