కృణాల్ పాండ్య కంటిన్యూగా వికెట్లు తీయడంతో కోల్ కతా(KKR) కోలుకోలేక పోయింది. కెప్టెన్ అజింక్య రహానె(56), వెంకటేశ్ అయ్యర్(6), రింకూసింగ్(12)ను అతడు వెంటవెంటనే ఔట్ చేశాడు. డికాక్(4), నరైన్(44), రసెల్(4) స్కోర్లివి. రహానె, నరైన్ జోడీ మాత్రమే బెంగళూరు బౌలర్లను అడ్డుకుంది. అందరూ ఔటవుతున్నా టెయిలెండర్లతో కలిసి మిడిలార్డర్ బ్యాటర్ రఘువంశీ(30) ఆదుకునే ప్రయత్నం చేశాడు. 150 దాటడానికి కోల్ కతా కష్టాలు పడాల్సి వచ్చింది. చివరకు KKR 8 వికెట్లకు 174 స్కోరు చేసింది.