మధ్య మధ్యలో వికెట్లు చేజారుతూ పడి లేస్తున్నా రన్ రేట్(Run Rate) మాత్రం ఎక్కడా తగ్గకపోవడంతో కోల్ కతా నైట్ రైడర్స్(KKR)ను భారీస్కోరు దిశగా నడిపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యస్ హాఫ్ సెంచరీ, ఫిల్ సాల్ట్ నిలకడైన ఆటతీరుతో ఆ జట్టు కోలుకుంది. ఆడింది ఇద్దరే అయినా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ మొత్తం 10 రన్ రేట్ కు పైగానే సాగింది.
ఫిల్ సాల్ట్(48; 14 బంతుల్లో 7×4, 3×6) విరుచుకుపడ్డా సునీల్ నరైన్(10), రఘువంశీ(3), వెంకటేశ్ అయ్యర్(16) ఫెయిలయ్యారు. కానీ శ్రేయస్(50; 36 బంతుల్లో 7×4, 1×6) రాణించాడు. అటు రింకూ సింగ్(24; 16 బంతుల్లో 2×4, 1×6) చివర్లో ఆండ్రీ రసెల్(27; 20 బంతుల్లో 4×4) బోర్ కొట్టించినా, రమణ్ దీప్ సింగ్(24; 9 బంతుల్లో 2×4, 2×6) నిలబడటంతో కోల్ కతా 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది.
ముఖ్యంగా రసెల్ బ్యాటింగ్ అతడి ఆటకు భిన్నం(Differently)గా స్లోగా నడిచింది. అయితే రసెల్ మాదిరిగా రమణ్ దీప్ వీరబాదుడుకు దిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బౌలర్లలో కామెరాన్ గ్రీన్, యష్ దయాల్ రెండు వికెట్ల చొప్పున.. సిరాజ్, ఫెర్గూసన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.