15వ ఓవర్ కు 122తో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్.. 19 ఓవర్ పూర్తయ్యే సరికి 187కు చేరుకుంది. చివర్లో బ్యాటర్లు విజృంభించడంతో స్కోరుకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు డికాక్(1), నరైన్(7) విఫలమైనా.. రహానే(38), రఘువంశీ(50), వెంకటేశ్ అయ్యర్(60) రాణించారు. రఘువంశీ-అయ్యర్ జోడీ హాఫ్ సెంచరీలతో జట్టును పటిష్ఠ స్థితికి చేర్చింది. అయ్యర్ 25 బంతుల్లో, రఘు 30 బంతుల్లో 50కి చేరుకున్నారు. రింకూసింగ్(32 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ తో ఆ జట్టు 6 వికెట్లకు సరిగ్గా 200 పరుగులు చేసింది.