మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 09 Jan 2024
సొంతగడ్డపై ఆడుతున్నా భారత మహిళా క్రికెట్ టీమ్(Women Team) లో పెద్దగా మార్పు కనపడటం లేదు. తొలి మ్యాచ్ లో గెలిచినా, వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ నే కోల్పోయింది. ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో మన జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన కంగారూ టీమ్.. పెద్దగా కష్టపడకుండానే గెలుపును సొంతం చేసుకుంది. 18.4 ఓవర్లలోనే ఆ జట్టు 3 వికెట్లకు 149 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
మళ్లీ అదే తంతు…
ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్ కోల్పోయిన ఉమెన్ టీమ్ లో ఈ సిరీస్ లోనూ పట్టుదల కనిపించలేదు. కేవలం తొలి టీ20లో మాత్రమే ప్రభావం చూపగలిగింది. షెఫాలి వర్మ(26), స్మృతి మంధాన(29), జెమీమా రోడ్రిగ్స్(2), హర్మన్ ప్రీత్(3), రిచా ఘోష్(34), దీప్తి శర్మ(14), అమన్ జ్యోత్ కౌర్(17) ఇలా అంతా పెద్దగా ఆడకుండానే చేతులెత్తేశారు. 66 స్కోరుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. చివరి వరకు అదే కష్టాల్లో కొనసాగింది.
ఆస్ట్రేలియా దూకుడు
కంగారూ జట్టుకు ఓపెనర్లే విజయాన్ని కట్టబెట్టారనడంలో సందేహం లేదు. కెప్టెన్ అలిసా హీలీ(55), బెత్ మూనీ(52 నాటౌట్) తగ్గకపోవడంతో కేవలం మూడు వికెట్లే కోల్పోయి టార్గెట్ ను రీచ్ అయింది. మెక్ గ్రాత్(20), లిచ్ ఫీల్డ్(17) ఇన్నింగ్స్ ముగించారు. ఈ టూర్ లో ఏకైక టెస్టులో భారత్ విజయం సాధిస్తే… వన్డే టోర్నీని 3-0తో, టీ20 సిరీస్ ను 2-1తో ఆసీస్ గెలుచుకుంది.