పంజాబ్ కింగ్స్(PBKS) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడమే కష్టమైపోయింది లఖ్నవూ(LSG)కు. మార్ క్రమ్(28), మార్ష్(0), పూరన్(44), పంత్(2), మిల్లర్(19)తో 119కే 5 ప్రధాన వికెట్లు చేజార్చుకుంది. చివర్లో బదోని(41)-సమద్ జోడీ(27) ఆదుకోవడంతో 150 దాటింది. వరుసగా మూడు మ్యాచుల్లో(0, 15, 2) కెప్టెన్ పంత్ విఫలమయ్యాడు. అర్షదీప్ సింగ్ మూడు వికెట్లతో ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. చేతిలో వికెట్లున్నా పంజాబ్ ధాటికి పరుగులు చేయలేక చివరకు 171/7కే పరిమితమైంది పంత్ సేన. మరిన్ని వార్తలకు https://justpostnews.com క్లిక్ చేయండి.