రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఏ దశలోనూ గట్టిగా ఆడలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. సాల్ట్(37), కోహ్లి(22), పడిక్కల్(1), పటీదార్(25), లివింగ్ స్టోన్(4), జితేష్ శర్మ(3), కృణాల్(18) నిలవకపోవడంతో పెద్దగా పరుగులు రాలేదు. 125కే 7 వికెట్లు పడ్డ జట్టును టిమ్ డేవిడ్(37 నాటౌట్) ఆదుకోవడంతో 7 వికెట్లకు 163 స్కోరు వచ్చింది. కుల్దీప్, విప్రజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.