సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జోరు తగ్గింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్(RR)పై 286 పరుగులు చేసి.. లఖ్నవూ(Lucknow)పై 190కే పరిమితమైంది. ఇప్పుడు ఢిల్లీతోనూ 150 దాటేందుకు ఇబ్బంది పడింది. అనికేత్(74) హిట్టింగ్ తో ఆ మాత్రమైనా చేయగలిగింది. అభిషేక్(1), హెడ్(22), ఇషాన్(2), నితీశ్(0), క్లాసెన్(32), అభినవ్(4), కమిన్స్(4) తక్కువకే ఔటయ్యారు. దీంతో 18.4 ఓవర్లలోనే 163కే చాపచుట్టేసింది. మొన్న లఖ్నవూ మ్యాచ్ లోనూ హెడ్(47) టాప్ స్కోరర్. ఆడితే అలవోకగా 250 దాటే SRHకు ఏమైందని అంతా ఆశ్చర్యపోతున్నారు.