239 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా(KKR) తొలుత జోరు చూపించి తర్వాత బేజారైంది. 162/3తో ఉన్న జట్టు 185కు చేరేసరికి 7 వికెట్లు కోల్పోయింది. డికాక్(15), నరైన్(30) ఔటయ్యాక రహానె(61), వెంకటేశ్(45) జోడీ ఆదుకుంది. కానీ ఈ ఇద్దరి ఔట్ తర్వాత రమణ్ దీప్(1), రఘువంశీ(5), రసెల్(7) ఇలా వచ్చి అలా వెళ్లడంతో నైట్ రైడర్స్ కథ సమాప్తమైంది. చివరకు 234/7కే పరిమితమై 4 రన్స్ తేడాతో ఓడింది. అంతకుముందు మార్ష్(81), పూరన్(87) రెచ్చిపోయి లఖ్నవూ(LSG)కి 238 పరుగుల భారీ స్కోరు కట్టబెట్టారు.