
ఐపీఎల్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)కు దాని సొంతగడ్డపైనే షాక్ ఇచ్చింది లక్నో సూపర్ జెయింట్స్(LSG). తొలుత హైదరాబాద్ 156/9 చేస్తే.. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో పంత్ గెలిపించాడు. మార్ క్రమ్(45) ఔటైతే.. పంత్(68 నాటౌట్) నిలబడ్డాడు. మార్ష్(14), బదోని(12), పూరన్(1), సమద్(16) ఔటైనా పెద్దగా ప్రభావం పడలేదు. ఇంకో బంతి మిగిలి ఉండగానే 5 వికెట్లకు 160 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలిచింది. హర్ష్ దూబె 2, మలింగ, శివాంగ్ తలో వికెట్ తీసుకున్నారు. ఆడిన మూడింటికి రెండింట్లో ఓడి ఒక మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్.