ఓపెనర్ క్వింటన్ డికాక్ బాదుడుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్(LSG) మంచి స్కోరే చేసింది. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే వికెట్లు ఇచ్చేసుకున్నా డికాక్ హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడి RCBకి అండగా నిలిచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్(20)తో కలిసి తొలి వికెట్ కు 53 పరుగులు జత చేశాడు. దీంతో లఖ్ నవూ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది.
మూడో వికెట్ కూ…
దేవ్ దత్ పడిక్కల్(6) తొందరగా ఔటైనా మార్కస్ స్టాయినిస్(24)తో కలిసి జోరు చూపించాడు డికాక్(81; 56 బంతుల్లో 8×4, 5×6). స్టాయినిస్ అవుటైనా ఆ ప్రభావం కనపడని విధంగా అతడి ఆట నడిచింది. మూడో వికెట్ కు ఈ జోడీ 56 రన్స్ జత చేసింది. చివర్లో పూరన్(40; 21 బంతుల్లో 1×4, 5×6) వీరబాదుడు బాదాడు. ముఖ్యంగా వరుసగా మూడు బంతులకు మూడు సిక్సర్లు కొట్టడంతో లఖ్ నవూ స్కోరు వేగం పెరిగింది.