రాజస్థాన్ రాయల్స్(RR) బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG)కు పరుగులు కష్టమైంది. మార్ క్రమ్(66), ఆయుష్ బదోని(50) హాఫ్ సెంచరీలతో కుదురుకున్నారు. చివర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 4 సిక్సులతో 30 బాదడంతో 150 స్కోరు దాటింది. మార్ష్(4), పూరన్(11), పంత్(3) పెద్దగా ఆడలేదు. చివరకు 5 వికెట్లకు 180 పరుగులు చేసింది LSG. హసరంగ రెండు వికెట్లు తీశాడు.