IPLలో లఖ్ నవూ సూపర్ జెయింట్స్(LSG) మరో విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోరే చేసినా దాన్ని కాపాడుకుంది. రాహుల్ సేన 5 వికెట్లకు 163 పరుగులు చేస్తే… గిల్ టీమ్ మొదట్నుంచీ టార్గెట్ రీచ్ అయ్యేలా కనపడలేదు. పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ 5 వికెట్లతో విజృంభించడంతో 130కే ఆలౌటై 33 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
స్టాయినిస్ ఫిఫ్టీ…
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లఖ్ నవూ.. మార్కస్ స్టాయినిస్(58; 43 బంతుల్లో 4×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించడంతో మెరుగైన స్కోరే చేసింది. డికాక్(6), పడిక్కల్(7) విఫలమైనా నికోలస్ పూరన్(32), ఆయుష్ బదోని(20)తో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. గుజరాత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ రావడం కష్టమైంది. ఉమేశ్ యాదవ్, దర్శన్ నెల్కండే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
టార్గెట్ ఛేదనలో…
తక్కువ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 26 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. 54 స్కోరు వద్ద తొలి వికెట్ చేజారితే 80కి చేరుకునే సరికి 5 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ గిల్(19), విలియమ్సన్(1), శరత్(2), విజయ్ శంకర్(17), దర్శన్ నెల్కండే(12) ఏ ఒక్కరూ నిలబడలేదు. యశ్ ఠాకూర్ ఐదు వికెట్లతో మెరిస్తే, కృణాల్ పాండ్య మూడు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించారు.