
భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫిట్నెస్ కారణంగా పేసర్ మహమ్మద్ షమీ దక్షిణాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. షమీ ఫిట్నెస్పై మెడికల్ ఈమ్ ఇంకా క్లియర్స్ ఇవ్వలేదని, అందువల్ల అతను దక్షిణాఫ్రికాకు వెల్లడం లేదని బీసీసీఐ ప్రకటించింది. షమీ.. మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటుండటంతో అతన్ని జట్టు నుంచి తప్పించింది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మహమ్మద్ షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే యువ పేసర్ దీపక్ చాహర్ వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.