నలుగురు డకౌట్..
అత్యధిక వ్యక్తిగత స్కోరు 10..
119 బాల్స్ ఆడితే అందులో 94 డాట్స్..
రన్స్ వచ్చిన బాల్స్ కేవలం 25..
ఇలా ఆసియా కప్ మహిళల టీ20 టోర్నీలో శ్రీలంక అన్ని రంగాల్లో ఆధిపత్యం చూపించడంతో మలేషియా దారుణంగా ఓటమి చెందింది. టాస్ గెలిచిన లంక తొలుత బ్యాటింగ్ చేసి చమరి ఆటపట్టు(119 నాటౌట్; 69 బంతుల్లో 14×4, 7×6) విజృంభణకు హర్షిత సమరవిక్రమ(26), అనుష్క సంజీవని(31) అండగా నిలవడంతో 184/4తో నిలిచింది.
లంక బౌలర్లు పోటీపడి వికెట్లు తీయడంతో బ్యాట్ అడ్డం పెట్టడమే కష్టంగా మారింది మలేషియా టీమ్ కి. ఎల్సా హంటర్(10) మాత్రమే రెండంకెల(Doublu Digit)ను అందుకుంది. నలుగురు సున్నాకు, ఇద్దరు 1కి, మరో ఇద్దరు 3 పరుగులకి చేతులెత్తేశారు. 40కే ఆలౌటై 144 రన్స్ తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది మలేషియా.