భారత్, వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. ఐదో రోజు సగం పూర్తయినా ఆట మొదలు కాలేదు. దీంతో ఈ మ్యాచ్ ను అంపైర్లు ‘డ్రా’గా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాలుగో రోజు ఆట ఎండ్ అయ్యే సరికి విండీస్ 76/2 స్కోరుతో ఉంది. త్యాగ్ నారాయణ్ చందర్ పాల్(24), బ్లాక్ వుడ్(20) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టుపై టీమ్ ఇండియా 289 రన్స్ లీడ్ లో ఉంది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో 438 , సెకండ్ ఇన్నింగ్స్ లో 181/2 పరుగుల్ని భారత్ సాధించింది. వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 255, సెకండ్ ఇన్నింగ్స్ లో 76/2తో ఉంది. తొలి టెస్టులో భారత్ గెలిచి 1-0తో లీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే.