క్యాచ్ వదిలేస్తే మ్యాచ్ పోతుందనడానికి ఐదో టెస్టే ఉదాహరణ. 374 లక్ష్యంలో 237 రన్స్ వెనుకబడ్డ ఇంగ్లండ్.. అప్పటికే 3 వికెట్లు పోగొట్టుకుంది. ఈ దశలో ప్రసిద్ధ్(Prasidh) బాల్ ను హ్యారీ బ్రూక్ గాల్లోకి లేపాడు. అది బౌండరీ వద్ద సిరాజ్ కు చిక్కింది. దాన్ని అందుకున్నా.. తన పాదాల్ని బౌండరీ లైన్ కు అంటించాడు. బౌండరీ వద్ద క్యాచ్ లతో అద్భుతాలు చేస్తున్న ఈరోజుల్లో.. అంత కష్టమైన క్యాచ్ కాకున్నా సిరాజ్ చేసిన తప్పిదం మ్యాచ్ ను మలుపు తిప్పింది. కోచ్ గంభీర్ సహా అంతా ఆశ్చర్యపోయారు. అలా బతికిపోయిన బ్రూక్.. మ్యాచ్ ను గెలిపించే స్థితికి చేర్చాడు. సెంచరీ(111) తర్వాత సిరాజ్ కే క్యాచ్ ఇచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.