1983 వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత భారత క్రికెట్ తలరాత మారితే.. IPL రాకతో ఆటగాళ్ల చరిత్ర కొత్త రూపు(New Life) సంతరించుకుంది. ఒక్కో క్రికెటర్ సంవత్సరంలోనే కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకుంటున్నాడు. అయితే క్రికెటర్లలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా పన్ను చెల్లించిన ప్లేయర్ గా నిలిచాడు విరాట్ కోహ్లి(Kohli). అతను రూ.66 కోట్ల టాక్స్ చెల్లించాడు.
ఆ తర్వాతి స్థానాల్లో మహేంద్రసింగ్ ధోని(రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్(రూ.28 కోట్లు), సౌరభ్ గంగూలీ(రూ.23 కోట్లు), హార్దిక్ పాండ్య(రూ.13 కోట్లు) ఉన్నారు. ఇక ఆట పరంగా చూస్తే మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్ కతా నైట్ రైడర్స్ కో-ఫౌండర్ షారుక్ ఖాన్ రూ.92 కోట్లు పన్ను కట్టాడు.