ఏ ఒక్కరూ సెంచరీ(Hundred) లేదా హాఫ్ సెంచరీ చేయకున్నా కలిసికట్టుగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చని ముంబయి ఇండియన్స్(MI) నిరూపించింది. వరుస ఓటములతో డీలా పడ్డ జట్టులో బ్యాటర్లంతా సమష్టి(Unity)గా రాణించడంతో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(49; 27 బంతుల్లో 6×4, 3×6), ఇషాన్ కిషన్(42; 23 బంతుల్లో 4×4, 2×6) తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు.
ఆ తర్వాత…
సూర్యకుమార్(0) డకౌట్ అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్య(39; 33 బంతుల్లో 3×4, 1×6) నిలబడ్డా తిలక్ వర్మ(6) రన్స్ కే ఔటయ్యాడు. దీంతో టిమ్ డేవిడ్(45; 21 బంతుల్లో 2×4, 4×6), రొమారియో షెఫర్డ్(39; 10 బంతుల్లో 3×4, 4×6) ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడారు.
ముఖ్యంగా చివరి ఓవర్లో 4, 6, 6, 6, 4, 6 రన్స్ తోపాటు షెఫర్డ్ ఉర్రూతలూగించాడు. ఆ ఓవర్లో 32 పరుగులు రావడంతో ముంబయి భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.