తొలుత తడబడి తర్వాత జోరు చూపించిన ముంబయి ఇండియన్స్ కు త్వరగానే బ్రేకులు వేసింది ఢిల్లీ క్యాపిటల్స్. నాట్ సీవర్, హర్మన్ ప్రీత్ జోడీ ధనాధన్ బ్యాటింగ్ తో మంచి స్కోరే నమోదైంది. మధ్యలో ఢిల్లీ బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడంతో మరిన్ని పరుగులకు అడ్డుకట్ట పడింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. యాస్తిక(11), హేలీ మాథ్యూస్(0)తో 32కే 2 వికెట్లు పడ్డాయి. అప్పుడు మొదలైంది కెప్టెన్ హర్మన్(42; 22 బంతుల్లో 4×4, 3×6) తుపాను. నాట్ సీవర్ తో కలిసి మూడో వికెట్ కు 73 రన్స్ జోడించింది. కానీ హర్మన్ తోపాటు అమేలియా కెర్(9), సజన(1), అమన్ జ్యోత్(7) ఔటవడంతో ముంబయి భారీ స్కోరు చేయలేకపోయింది. చివరకు నాట్ సీవర్(80 నాటౌట్; 59 బంతుల్లో 13×4) ఒంటరి పోరాటం చేసినా మరో 5 బాల్స్ మిగిలి ఉండగానే 164కు ఆలౌటైంది.