మూడింటికి మూడు మ్యాచ్ ల్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్(Point Table)లో అట్టడుగు(Last) స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్(MI) ఎట్టకేలకు నాలుగో మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకుంది. భారీ లక్ష్యాన్ని(Huge Target) ఢిల్లీ క్యాపిటల్స్ అందుకోలేకపోవడంతో హార్దిక్ సేన తొలి గెలుపును సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లకు 205 పరుగులు చేసిన ఢిల్లీ.. 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
కలిసికట్టుగా…
ఓపెనర్లు రోహిత్ శర్మ(49; 27 బంతుల్లో 6×4, 3×6), ఇషాన్ కిషన్(42; 23 బంతుల్లో 4×4, 2×6) తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. సూర్యకుమార్(0) డకౌట్ కాగా తిలక్ వర్మ(6) రన్స్ కే ఔటయ్యాడు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య(39; 33 బంతుల్లో 3×4, 1×6), టిమ్ డేవిడ్(45; 21 బంతుల్లో 2×4, 4×6), రొమారియో షెఫర్డ్(39; 10 బంతుల్లో 3×4, 4×6) ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడారు. ముఖ్యంగా చివరి ఓవర్లో 4, 6, 6, 6, 4, 6 రన్స్ తోపాటు షెఫర్డ్ ఉర్రూతలూగించాడు. ఆ ఓవర్లో 32 పరుగులు రావడంతో ముంబయి భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.
ఢిల్లీ జట్టులో…
ఓపెనర్ పృథ్వీషా(66; 40 బంతుల్లో 8×4, 3×6) గట్టిగా నిలబడ్డాడు. వార్నర్(10) ఔటైనా అభిషేక్ పోరెల్(41; 31 బంతుల్లో 5×4), ట్రిస్టన్ స్టబ్స్ జోడీ నిలకడగా ఆడింది. పోరెల్ ఔటయ్యాక క్రీజులోకొచ్చిన కెప్టెన్ పంత్(1) కూడా పెవిలియన్ దారి పట్టాడు. మరోవైపు స్టబ్స్(71; 27 బంతుల్లో 3×4, 7×4) మాత్రం స్పీడ్ కొనసాగించినా ఢిల్లీని గెలిపించలేకపోయాడు.