సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)కు ఈ ఐపీఎల్ లో ఐదో ఓటమి ఎదురైంది. ముంబయితో జరిగిన మ్యాచ్ లో తొలుత 162/5 చేసిన SRH.. ప్రత్యర్థి వికెట్లు తీయలేక పరాజయం పాలైంది. రికిల్టన్(31), రోహిత్(26), జాక్స్(36), సూర్య(26), హార్దిక్(21), తిలక్(21 నాటౌట్) ఇలా తలో చేయి వేయడంతో ముంబయి ఇండియన్స్(MI) గెలుపు సులువైంది. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసినా లాభం లేకుండా పోయింది. 18.1 ఓవర్లలో 166/6 చేసిన ముంబయి.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడిన ఏడింట్లో హైదరాబాద్ కు ఇది ఐదో ఓటమి కాగా.. అంతే మ్యాచులాడిన ముంబయికి ఇది మూడో విజయం.