జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో ఒలింపిక్ ఛాంపియన్ ఉండగా.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ షిప్ కూడా వచ్చి చేరింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 88.17 మీటర్ల మేర త్రో విసిరి అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తంగా అథ్లెటిక్స్ లో ఇప్పటిదాకా భారత్ సాధించిన వాటిలో ఇది మూడో స్వర్ణం కావడం విశేషం. పాకిస్థాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ రెండో స్థానంలో నిలిచి రజతం, చెక్ రిపబ్లిక్ కు చెందిన వద్లెచ్ థర్డ్ ప్లేస్ తో కాంస్యం దక్కించుకున్నారు.