పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో మరో రెండు పతకాలు ఖాయమైనట్లే కనపడుతున్నది. జావెలిన్ త్రోలో ‘భారత గోల్డెన్ బాయ్(Golden Boy)’ నీరజ్ చోప్రా ఫైనల్ కు దూసుకెళ్లాడు. అటు వినేశ్ ఫొగాట్ మహిళల 50 కేజీల ఫ్రీ-స్టైల్ విభాగంలో సెమీ ఫైనల్ చేరింది.
మూడోసారి ఒలింపిక్స్ ఆడుతున్న ఫొగాట్.. ఉక్రెయిన్ కు చెందిన ఒక్సానా లివచ్ పై క్వార్టర్ ఫైనల్లో 7-5తో విజయం సాధించింది. ఇక జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా విజయదుందుభి కొనసాగుతున్నది. మరో జావెలిన్ స్టార్ కిశోర్ జెనా ఫైనల్ కు చేరడంలో విఫలమైనా నీరజ్ మాత్రం భారత్ కు కప్పును ఖాయం చేశాడు.