Published 05 Jan 2024
ఈ సంవత్సరం జరగబోయే టీ20 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ కాగా.. కొన్ని కొత్త జట్లు ఈ సారి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మూడు నూతన టీమ్(New Teams)లు తొలిసారిగా పురుషుల టీ20 క్రికెట్ లో అడుగుపెడుతున్నాయి. అమెరికా, వెస్టిండీస్ జాయింట్ గా ఆతిథ్యమివ్వనున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ.. జూన్ 1న ప్రారంభమవుతుంది. ఈసారి 20 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా.. ఐదేసి టీమ్ లతో ఒక్కో గ్రూప్ ఉంటుంది. జూన్ 1 నుంచి 18వ తేదీ వరకు గ్రూప్ స్టేజ్… 19 నుంచి 24 వరకు సూపర్-8 రౌండ్ మ్యాచ్ లు ఉంటాయి. కెనడా, అమెరికా, ఉగాండా… పురుషుల టీ20 వరల్డ్ కప్ లో కొత్తగా దర్శనమివ్వనున్నాయి.
లీగ్ దశలో టాప్ జట్లకే…
జూన్ 9న న్యూయార్క్ లో భారత్-పాకిస్థాన్ తలపడనుండగా… ఈ టోర్నీ గ్రూప్ దశలో టాప్-2 ప్లేస్ ల్లో నిలిచే టీమ్ లు సూపర్-8కు క్వాలిఫై అవుతాయి. ఐదు జట్లున్న ఒక్కో గ్రూప్ నుంచి బెస్ట్ పాయింట్స్ తో తదుపరి రౌండ్(Next Round)కి రెండు టీమ్ లు వెళ్తాయి. ఈ సూపర్-8కు ఎంటరయ్యే 8 టీమ్ లు సైతం మళ్లీ నాలుగేసి జట్లతో రెండు గ్రూపులుగా ఏర్పడతాయి. భారత్ తన తొలి మొదటి మూడు మ్యాచ్ లు న్యూయార్క్ లోని ఐసన్ హోవర్ పార్క్ లో, నాలుగో టీ20ని ఫ్లోరిడాలో ఆడుతుంది. జూన్ 1న అమెరికా-కెనడా మ్యాచ్ తో టోర్నీ స్టార్ట్ అవుతుండగా.. జూన్ 29న బార్బడోస్ లో ఫైనల్ జరుగుతుంది. మొత్తం 55 మ్యాచ్ ల్ని 9 వేదికలపై ఆడిస్తుంటే.. అందులో వెస్టిండీస్ లో 6, USAలో 3 గ్రౌండ్స్ ఉన్నాయి.
టోర్నీ ఫుల్ డీటెయిల్స్ ఇలా…
గ్రూప్ A — భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా(USA)
గ్రూప్ B — ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ C — న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండా, పపువా న్యూగినియా
గ్రూప్ D — దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
సూపర్-8 రౌండ్
గ్రూప్ -1 : A1 Vs B2
C1 Vs D2
గ్రూప్ -2 : A2 Vs B1
C2 Vs D1
సెమీఫైనల్స్:
జూన్ 26 : ఫస్ట్ సెమీస్ – గయానా(వెస్టిండీస్)
జూన్ 27 : సెకండ్ సెమీస్ – ట్రినిడాడ్(వెస్టిండీస్)
ఫైనల్:
జూన్ 29 : బార్బడోస్(వెస్టిండీస్)