మెగా టోర్నీల్లో సెమీఫైనల్ అంటేనే ఆందోళనకు గురయ్యే సౌతాఫ్రికా.. ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీస్ లోనూ అదే తీరు కనబర్చింది. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో.. న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(102) సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 164 పరుగులు జోడించారు. మిచెల్(49), ఫిలిప్స్(49) తోడవడంతో కివీస్.. 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎంగిడి 3, రబాడ 2 వికెట్లు తీసుకున్నారు.