వేసిన ప్రతి బాల్ డాట్.. నాలుగు ఓవర్లలో 24 బంతులేస్తే వాటికి ఒక్క రన్ కూడా రాలేదు.. ఆడింది పసికూనే అయినా సింగిల్ రన్ తీసే సాహసం చేయలేదు.. అలా 4 ఓవర్ల స్పెల్ లో ఒక్క రన్ ఇవ్వకుండా 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్(Lockie Ferguson).
టీ20 వరల్డ్ కప్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పపువా న్యూ గినియా(Papua New Guinea) 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 78 పరుగులు చేసింది. మిగతా ఏ బౌలర్ కూ సాధ్యం కాని రీతిలో నాలుగింటికి నాలుగు ఓవర్లను మెయిడెన్ వేశాడు ఫెర్గూసన్. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్ వంటి టాప్ బౌలర్లను ఎదుర్కొని రన్స్ తీసిన పపువా న్యూ గినియా బ్యాటర్లు.. ఫెర్గూసన్ బంతుల్ని ఆడడానికే అవస్థలు పడ్డారు.
పపువా న్యూ గినియా టీమ్ లో ఛార్లెస్ అమిని(17), నార్మన్ వనువా(14), సెసె బావు(12) టాప్ స్కోరర్లు. అయితే ఇప్పటికే కివీస్ జట్టు సూపర్-8కు చేరకుండానే స్వదేశం పయనం కానుంది. గ్రూప్ దశలోనే న్యూజిలాండ్ కథ ముగిసింది.