ఐదు టీ20ల సిరీస్ ను 1-4తో కోల్పోయిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ తో తొలి వన్డేలోనూ ఓడింది. సొంతగడ్డపై 344/9తో భారీ స్కోరు చేసిన కివీస్.. ప్రత్యర్థిని 271కే ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లో చాప్ మన్(132), మిచెల్(76), అబ్బాస్(52) స్కోర్లు చేశారు. తర్వాత పాక్ టీంలో అజామ్(78), సల్మాన్ అఘా(58) మాత్రమే ఆడారు. పేసర్ నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు తీసుకోవడంతో పాక్ కు ఓటమి తప్పలేదు.