ICC టోర్నీల్లో దక్షిణాఫ్రికాకు సెమీస్ గండం తప్పేలా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లోనూ ఆ జట్టు రాత మారలేదు. భారత్ తో ఫైనల్లో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది. పెద్ద టార్గెట్ ఎదురుగా ఉన్నా దాన్ని ఛేదించాలన్న ఆలోచనే కనపడలేదు సౌతాఫ్రికా ప్లేయర్లకు. ఒక్క భారీ పార్ట్నర్ షిప్ నమోదు కాకపోవడంతో సెమీస్ ఫోబియా నుంచి బయటపడలేకపోయింది. 200 స్కోరుకే 6 కీలక వికెట్లు కోల్పోయి ఇక కుదురుకోలేకపోయింది. రికిల్టన్(17), బవుమా(56), డసెన్(69), మార్ క్రమ్(31), క్లాసెన్(3), ఔటవడంతో సెమీఫైనల్లోనే సౌతాఫ్రికా నిష్క్రమించింది. మిల్లర్(100 నాటౌట్) చివర్లో మెరిపించినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ జట్టు 50 ఓవర్లలో 312/9తో నిలిచి 50 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.