ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. రోహిత్ మరోసారి టాస్ ఓడిపోగా.. కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ ఓడటంలో ఇప్పటికే రికార్డు సృష్టించిన టీమ్ఇండియా.. మరోసారి దాన్ని పునరావృతం(Repeat) చేసింది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. నలుగురు స్పిన్నర్లతోనే ఆడనుంది.
భారత జట్టు…: రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమి, కుల్దీప్, వరుణ్