ఇతరులపై సిక్సర్లు బాదడం కాదు.. తనకూ అదే ఎదురైతే ఎలా ఉంటుందో సన్ రైజర్స్ కు అర్థమైంది. పూనకం వచ్చినట్లు ఆ జట్టుపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు నికోలస్ పూరన్. అతడు 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకోగా.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తొలుత మార్ క్రమ్(1) ఔటైతే.. పూరన్(70; 26 బంతుల్లో 6×4, 6×6) రాకతో వాతావరణం మారిపోయింది. ఒకవైపు మార్ష్(52) అడపాదడపా షాట్లు కొడితే వెస్టిండీస్ ప్లేయర్ మాత్రం రెచ్చిపోయాడు. దీంతో 7.2 ఓవర్లలోనే 100 స్కోరు దాటింది సూపర్ జెయింట్స్(LSG). షమి, కమిన్స్, జంపా వంటి మేటి బౌలర్లంతా బలయ్యారు. 16.1 ఓవర్లలో 193/5 చేసిన లఖ్నవూ.. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.