పద్నాలుగేళ్ల పిల్లాడంటే ఇష్టమొచ్చింది తినాలి, నచ్చిన చోటకు వెళ్లాలన్నవారే ఎక్కువ. కానీ వైభవ్ సూర్యవంశీ(Surya Vamshi) అలా కాదు. గత నెలలోనే 14 ఏళ్ల వయసులోకి ప్రవేశించిన అతడు IPLలో ఆడిన అతి చిన్నోడిగా చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి బంతినే సిక్సర్ గా మలిచి 20 బంతుల్లో 34 చేసి ఔరా అనిపించాడు. అతణ్ని గతేడాది రాజస్థాన్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. బిహార్ సమస్తిపూర్ జిల్లా తేజ్ పూర్ కు చెందిన వైభవ్.. తండ్రి ప్రోత్సాహంతో 9 ఏళ్లకే క్రికెట్ ప్రారంభించాడు.
పిజ్జా, మటన్ లకు చెక్ పెట్టాలని చిన్నప్పుడే చెప్పడంతో మటన్ సహా చికెన్ కూ దూరంగా ఉన్నాడు. ‘మేం మటన్, పిజ్జాలు ఇస్తే మొత్తం తినేస్తాడు.. పిల్లాడు కాబట్టి అందులో అనుమానం లేదు.. మొత్తం తినేస్తే లావవుతాడు..’ అని అతడి కోచ్ మనీష్ ఓఝా చెబుతున్నాడు. అతడు చాలా కాలం ఆడాలన్నదే తమ లక్ష్యమని, భవిష్యత్తులో సూర్యవంశీ భారీగా పరుగులు చేస్తాడని అంటున్నాడు. యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా కలిపితే వైభవ్ అన్న పేరుంది.