చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ దెబ్బకు ముంబయి(Mumbai Indians) విలవిల్లాడింది. 4 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి అతడు 4 వికెట్లు తీసుకున్నాడు. రోహిత్(0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ రికిల్టన్(13), సూర్య(29), తిలక్(31) జాక్స్(11), మింజ్(3), నమన్(17), శాంట్నర్(11) ఇలా అంతా పెవిలియన్ చేరారు. సూర్య, తిలక్, మింజ్, నమన్.. ఇలా నలుగుర్నీ నూర్ అహ్మద్ వెనక్కు పంపాడు. ఖలీల్ అహ్మద్ 3, అశ్విన్, ఎలిస్ చెరో వికెట్ చొప్పున తీసుకున్నారు. ధోని మరోసారి తన అద్భుత చాతుర్యంతో.. నూర్ బంతిని క్షణాల్లో వికెట్లకు విసరడంతో సూర్య వెనుదిరగాల్సి వచ్చింది. తుదకు 9 వికెట్లకు 155 స్కోరు వద్దే ముంబయి ఆగిపోయింది.