వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు హవా కొనసాగుతున్నది. వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న ప్లేయర్లు.. ర్యాంకింగ్స్ లోనూ అగ్రస్థానాలకు చేరుకున్నారు. భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్.. ICC ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను దాటి 830 పాయింట్లతో నంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో ఇప్పటివరకు శుభ్ మన్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు చోటు పొందారు. కోహ్లి నాలుగు, రోహిత్ 6వ స్థానంలో నిలిచారు. బాబర్ అజామ్ కన్నా 6 పాయింట్లు ఆధిక్యంలో నిలవగా మూడో స్థానంలో ఉన్న డికాక్ కు 771 పాయింట్లు ఉన్నాయి.
బౌలింగ్ లోనూ మనమే
అటు బౌలర్ల ర్యాంకింగ్స్ లోనూ మహ్మద్ సిరాజ్ నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకొన్నాడు. టాప్-10 అత్యుత్తమ బౌలర్లలో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. కుల్దీప్ 4, బుమ్రా 8, షమి 10 స్థానాలను ఆక్రమించారు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 10వ స్థానంలో నిలిచాడు.
- శుభ్ మన్ గిల్ – 830
- బాబర్ అజామ్ – 824
- క్వింటన్ డికాక్ – 771
- విరాట్ కోహ్లి – 770
- డేవిడ్ వార్నర్ – 743
- రోహిత్ శర్మ – 739
- వాండెర్ డసెన్ – 730
- హెచ్.టి.టెక్టర్ – 729
- హెన్రిచ్ క్లాసెన్ – 725
- డేవిడ్ మలన్ – 704