నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. టీ20 క్రికెట్ యుగంలో క్రమంగా ఆదరణ కోల్పోతున్న 50 ఓవర్ల మ్యాచ్ లకు ప్రపంచ కప్ లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత రన్నరప్ న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అహ్మదాబాద్ లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తం 10 టీమ్ లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నమెంటు 13వ వరల్డ్ కప్. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి ప్రపంచకప్ అందుకున్న భారత్ తిరిగి 28 సంవత్సరాల తర్వాత 2011లో ధోని నేతృత్వంలో మరోసారి కప్పును ముద్దాడింది. ఈసారి రోహిత్ సేన బలంగా కనిపిస్తున్నా పటిష్ఠ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి దేశాలతో ఎలా ఆడుతుందన్నది చూడాలి. భారత జట్టు ఈ నెల 8న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది.
భారత్ మ్యాచ్ ల వివరాలు
- అక్టోబరు 8: ఆస్ట్రేలియాతో… వేదిక చెన్నై
- అక్టోబరు 11: అఫ్గానిస్థాన్ తో… వేదిక దిల్లీ
- అక్టోబరు 15: పాకిస్థాన్ తో… వేదిక అహ్మదాబాద్
- అక్టోబరు 19: బంగ్లాదేశ్ తో… వేదిక పుణె
- అక్టోబరు 22: న్యూజిలాండ్ తో… వేదిక ధర్మశాల
- అక్టోబరు 29: ఇంగ్లాండ్ తో… వేదిక లఖ్ నవూ
- నవంబరు 2: క్వాలిఫయర్-2తో… ముంబయి
- నవంబరు 5: దక్షిణాఫ్రికాతో… కోల్ కతా
- నవంబరు 11: క్వాలిఫయర్-1తో… బెంగళూరు