ఓపెనర్ యశస్వి జైస్వాల్(143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14×4), రోహిత్ శర్మ అద్భుత సెంచరీలు సాధించడంతో వెస్టిండీస్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. అరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టి జైస్వాల్.. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సెకండ్ డే ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 312 రన్స్ చేసింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(103; 221 బంతుల్లో 10×4, 2X6) సైతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే రోహిత్ ఔటైన వెంటనే శుభ్ మన్ గిల్ కూడా(6) పెద్దగా స్కోరు చేయకుండానే వెనుదిరిగాడు. జైస్వాల్ కు తోడుగా విరాట్ కోహ్లి(360 బ్యాటింగ్; 96 బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నాడు. ఫస్ట్ వికెట్ కు 229 రన్స్ పార్ట్నర్ షిప్ అందించి ఓపెనర్లు జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు.
ఓవర్ నైట్ స్కోరు 80/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టును ఓపెనర్లు ముందుండి నడిపించారు. ఏమాత్రం ప్రభావం చూపలేని విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. బౌలింగ్ బాగానే వేసినా వికెట్లు తీయలేకపోయారు. మొదట్లో ఆచితూచి ఆడుతూనే ఈ ఇద్దరూ క్రమంగా పరుగులు సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ను 150 రన్స్(Runs)కే ఆలౌట్ చేసిన భారత్… మొత్తంగా 162 పరుగుల లీడ్(Lead)లో ఉంది. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వేరికాన్, ఎలీక్ అథనేజ్ చెరో వికెట్ పడగొట్టారు.