
మరోసారి భారతజట్టు.. పాకిస్థాన్ వెన్నువిరిచింది. ఆసియా కప్ ఫైనల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. భారత బౌలర్ల ధాటికి కొన్ని నిమిషాల్లోనే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చెల్లాచెదురైంది. 113/2తో పటిష్ఠంగా కనిపించిన టీమ్ కాస్తా 134/8కి చేరుకుంది. కుల్దీప్ 4.. వరుణ్, అక్షర్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఓపెనర్లు ఫర్హాన్(57), ఫకర్(46) టాప్ స్కోరర్లు. ముగ్గురు డకౌటైతే, మరో ఐదుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివరకు 19.1 ఓవర్లలో 146కు పాక్ ఆలౌటైంది.