భారత్ తో జరిగే మ్యాచ్ కోసం ఇంట్రెస్టింగ్ గా ఉన్నామని దాయాది దేశమైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. ‘మా మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.. ఈ మ్యాచ్ కోసం తాను కూడా చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నా.. రెండు జట్ల మధ్య జరిగే పోరును అభిమానులే కాకుండా ప్లేయర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.. భారత్-పాక్ మ్యాచ్ లంటేనే ఎప్పుడూ బెస్ట్ రేంజ్ లో ఉంటాయి.. గట్టి పోటీ ఉండటం కామన్.. మేం కూడా అదే కోరుకుంటాం.. బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఆడతాం.. అలా ఆడకుంటే అభిమానులకు కిక్కే ఉండదు’ అని పాక్ కెప్టెన్ అన్నాడు. ఈ రెండు జట్ల మధ్య పోరు సెప్టెంబరు 2న జరగనుంది. ఆసియా కప్ లో భాగంగా మరో వారం రోజుల్లో భారత్-పాక్ తలపడనున్నాయి.
చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లు ఏ లెవెల్లో జరిగినా ఆ ఆసక్తే వేరు. ఈ మ్యాచ్ లు చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఉవ్విళ్లూరుతారు. ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లో ఆడి దశాబ్దం గడుస్తుండగా.. కేవలం ICC టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ ఆసియా కప్ తర్వాత ఇక అక్టోబరులో జరిగే వరల్డ్ కప్ లోనూ చిరకాల ప్రత్యర్థులు పోటీపడతాయి.