టీమ్ఇండియా(Team India) దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడింది. 6 స్కోరుకే 2 వికెట్లు చేజార్చుకోగా, ఏ దశలోనూ కోలుకోలేదు. భారత బౌలర్లు కంటిన్యూగా వికెట్లు తీసి స్కోరు బోర్డును ముందుకు కదలనివ్వలేదు. ఓవర్లు ముగిసేసరికి 127/9 చేసింది పాక్. చివర్లో అఫ్రిది(33 నాటౌట్; 16 బంతుల్లో) 4 సిక్సర్లతోనే ఆ మాత్రం స్కోరు వచ్చింది. ఆయూబ్(0), ఫర్హాన్(40), హారిస్(3), ఫఖర్(17), ఆఘా(3), నవాజ్(5) ఇలా వచ్చి అలా వెళ్లారు. కుల్దీప్ 3, అక్షర్ 2, బుమ్రా 2, పాండ్య, వరుణ్ తలో వికెట్ చొప్పున తీసుకున్నారు.