ప్రపంచంలో ఎక్కడ ICC టోర్నీ జరిగినా ఊహించని లాభాలుంటాయి. కానీ పాకిస్థాన్ అందుకు పూర్తి భిన్నం. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చి బాగా సంపాదించాల్సిన PCB.. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. మొత్తంగా రూ.869 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ టోర్నీ కోసం రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల కోసం 58 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కానీ టికెట్లు, స్పాన్సర్షిప్ ద్వారా 6 మిలియన్ డాలర్లు మాత్రమే తిరిగివచ్చింది. ఈ ప్రభావం పాక్ నేషనల్ క్రికెట్ పై పడింది. నష్టాలు పూడ్చుకునేందుకు గాను జాతీయ టీ20 ఛాంపియన్ షిప్ లో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్ని 90 శాతం తగ్గించింది. అంటే కేవలం వారి మొత్తం ఫీజులో 10 శాతమే చెల్లిస్తుందన్నమాట.