వరుసగా ఓడిపోయి ఇతర జట్ల(Other Teams) జయాపజయాల మీద ఆధారపడ్డ పాకిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు.. లీగ్(League) దశలోనే నిష్క్రమించింది. బంగ్లాదేశ్ పై గెలుపొందిన న్యూజిలాండ్.. 4 పాయింట్లతో భారత్ తో సమానంగా నిలిచి సెమీస్ లో అడుగుపెట్టింది. రావల్పిండిలో జరిగిన మ్యాచ్ లో తొలుత బంగ్లా.. 236/9 చేసింది. కెప్టెన్ శాంటో(77), జకీర్(45) హయ్యెస్ట్ స్కోరర్లు. కివీస్ బౌలర్ బ్రేస్ వెల్ 4 వికెట్లు తీశాడు. మోస్తరు టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర సెంచరీ(112)తో ఘన విజయం సాధించింది. యంగ్(0), విలియమ్సన్(5), కాన్వే(30) ఔటైనా రచిన్, లాథమ్(55) జోడీ బంగ్లా భరతం పట్టింది. 46.1 ఓవర్లలో 240/5తో నిలిచి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూప్-Aలో పాక్, బంగ్లా ఇంటిముఖం పట్టాయి.