ఒకే ఒక్క పాక్ స్టార్ బాబర్ అజామ్ అని, అతణ్ని విమర్శించొద్దంటూ స్పిన్నర్ సయీద్ అజ్మల్ కోరాడు. న్యూజిలాండ్ సిరీస్ కు పక్కనపెట్టడంపై PCB మీద మండిపడ్డాడు. ప్రతిసారీ రాణించడం సచిన్ కే సాధ్యం కాలేదని, ఇక బాబర్ ను ఎలా విమర్శిస్తారంటూ మాజీలపై ఫైర్ అయ్యాడు. పాక్ క్రికెట్ కు పేరు తెచ్చిన అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దన్నాడు.
2023 వరల్డ్ కప్ లీగ్ దశలోనే ఓడటం, అఫ్గాన్ చేతిలో వన్డే పరాజయం తర్వాత కెప్టెన్సీ నుంచి బాబర్ వైదొలిగినా, టీ20 ప్రపంచకప్ కు మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. కానీ ICC ఈవెంట్లలో అమెరికా చేతిలోనూ చిత్తవడంతో రిజ్వాన్ కెప్టెన్ అయ్యాడు.