ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ జట్టు నంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంది. అఫ్గాన్ తో శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన పాక్.. మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వల్ప రేటింగ్ తో ఆస్ట్రేలియా మీద పైచేయి సాధించింది. పాక్ కు 118.48 పాయింట్లు దక్కగా.. ఆసీస్ 118 రేటింగ్ తో ఉంది. ఇక మూడో స్థానంలో టీమ్ఇండియా నిలిచింది. ఈ వన్డే ర్యాంకింగ్స్ లో 113 రేటింగ్ ను భారత జట్టు సాధించింది.
ఇక న్యూజిలాండ్ నాలుగో ప్లేస్ లో, ఇంగ్లండ్ ఐదో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ ఉన్నాయి.