ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ విజయం సాధించింది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఆటగాడు డి లీడ్ అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శన చూపినా.. ఆ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించగా.. పాకిస్థాన్ తొలుత 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన డచ్ జట్టు 41 ఓవర్లలో 205 రన్స్ కు ఆలౌట్ కావడంతో 81 పరుగులతో గెలుపును పాక్ సొంతం చేసుకుంది. ఓపెనర్లు ఫకర్ జమాన్(12), ఇమాముల్ హక్(15) తోపాటు కెప్టెన్ బాబర్ అజామ్(5) వెంటవెంటనే ఔటయ్యారు. 38 రన్స్ కే 3 వికెట్లు పడ్డ జట్టును కీపర్ రిజ్వాన్(68), సౌద్ షకీల్(68) ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 120 రన్స్ పార్ట్నర్ షిప్ జోడించారు. మహ్మద్ నవాజ్(39), షాదాబ్ ఖాన్(32) రాణించడంతో పాక్ 286 రన్స్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లీడ్ 4, అకర్ మాన్ 2, వికెట్లు తీశారు.
డచ్ ప్లేయర్స్ పోరాట పటిమ
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పసికూన నెదర్లాండ్స్ పోరాటం కనబరిచింది. పాక్ సీమ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని నిలబడింది. ఓపెనర్ మాక్స్ ఒడౌడ్(5)కే వెనుదిరిగినా మరో ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (52) రన్స్ చేశాడు. విక్రమ్ జీత్, అకర్ మాన్(67) పాక్ బౌలర్ల నుంచి బాగానే పరుగులు రాబట్టారు. కానీ చివరి వరుస బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో ఆ జట్టు కథ ముగిసింది.