మహ్మద్ రిజ్వాన్… ఈ పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గ్రౌండ్ లో ప్రవర్తించే తీరు అతి(Over Action)గా అనిపిస్తుంటుంది. నిన్నటి మ్యాచ్ లో కెనడా బౌలర్ బాల్ వేస్తున్న సమయంలో అది చేయి జారి స్లోగా వెళ్లింది. దానికి కౌంటర్ ఇస్తున్నట్లు(ఫొటోలో)గా బ్యాటింగ్ చేసి నెటిజన్ల చేత విమర్శలు(Critics) ఎదుర్కొన్నాడు రిజ్వాన్.
ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు(USA, భారత్) ఓటములు మూటగట్టుకున్న పాక్.. కెనడాపై 7 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపులో రిజ్వాన్(53)దే కీలక పాత్ర. అతడు హాఫ్ సెంచరీ చేసి జట్టును నిలబెట్టినా చెత్త రికార్డు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.
అత్యధిక బాల్స్…
107 టార్గెట్ లో రిజ్వాన్ దే సగం స్కోరు. కానీ హాఫ్ సెంచరీకి అతడు ఆడిన బాల్స్ 52. ఇది పొట్టి ఫార్మాట్లో అత్యంత చెత్త రికార్డు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ది. అతడు 50 బాల్స్ లో ఫిఫ్టీ చేస్తే ఇప్పుడు రిజ్వాన్ దాన్ని దాటి మరో 2 బంతులు ఎక్కువ తీసుకున్నాడు.