యాక్సిడెంట్లో ప్రాణాలతో బయటపడ్డ తనకు పాదం ఎముక విరిగిన నొప్పి ఓ లెక్కనా అంటూ పంత్ చూపిన ధైర్యం.. అందరినీ ఆకట్టుకుంది. అతడు హాఫ్ సెంచరీ(54) పూర్తి చేసుకోగా.. 358కి టీమ్ఇండియా ఆలౌటైంది. నాలుగో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ పంత్.. 37 పరుగులతో తిరిగి అడుగుపెట్టి ఫిఫ్టీ పూర్తి చేశాడు. జైస్వాల్(58), రాహుల్(46), సుదర్శన్(61), గిల్(12), జడేజా(20), శార్దూల్(41), సుందర్(27) చొప్పున చేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచులోనూ రాణించి 5 వికెట్లు తీసుకోగా, ఆర్చర్ ముగ్గుర్ని ఔట్ చేశాడు. https://justpostnews.com